Dinakar Reddy

Abstract Thriller

4  

Dinakar Reddy

Abstract Thriller

అలల్లో కలలు

అలల్లో కలలు

1 min
562


బంగాళాఖాతం హోరు చెవులకు వినిపిస్తోంది. పౌర్ణమి రోజు చంద్రుడి కిరణాలు నన్ను తాకి తరువాత అలల్ని తాకుతున్నాయి.


నన్నూ చంద్రుడని భావించి కాబోలు, నన్ను తాకడానికి అలలు ఎగసి స్టీమర్ బోటులో నేను కూర్చున్న వైపు ఎగిరి పడ్డాయి. నేను నా పేరు సూర్య అని చెప్పాను. అయినా అవి వింటేనా.


ఇక ఇలా కాదని చేతిలో ఉన్న పదార్థం ఏదో సముద్రంలో వేశాను. అలలు ఇంకా ఎగిసిపడుతున్నాయి. అదేదో చేపలా ఉంది. చేప.. చేప పెద్ద చేప.. అమ్మో! తిమింగలం. 


స్టీమర్ బోటును అటు వైపు తిప్పమని అరిచాను. నా మాట ఎవ్వరికీ వినిపించట్లేదు.


ఆ తిమింగలం స్టీమరును నెట్టింది. ఇదేదో టైటానిక్ వ్యవహారంలా ఉందే. నేను జాక్ నూ కాదు. నా దగ్గరా రోజ్ కాదు కదా రోజ్ పువ్వు కూడా లేదు.


కంగారుగా అటూ ఇటూ తిరిగాను. ఎవరో పిలిచినట్లు అనిపించి పక్కకు చూశాను.


నేనే నిద్రలో కల గని బెడ్ షీట్ కింద పడేసుకున్నాను. ఇంకా నయం. నాకు చేపలో ఉండే ముళ్ళంటే భయం. ఆ తిమింగలం నిజంగా వచ్చుంటేనో..


Rate this content
Log in

Similar telugu story from Abstract