Dinakar Reddy

Abstract Comedy Drama

4  

Dinakar Reddy

Abstract Comedy Drama

అబ్బాయి సాఫ్ట్ వేరా.. కాదా!

అబ్బాయి సాఫ్ట్ వేరా.. కాదా!

1 min
562


మొత్తానికి ఉద్యోగం వల్లే పెళ్లి కావట్లేదు అంటావ్ అన్నాడు కిషోర్. అవున్రా బాబు. ప్రతి ఒక్కరూ సాఫ్ట్ వేర్ సంబంధమే కావాలి అంటున్నారు అని వాపోయాడు రాజీవ్.


మనమూ కొన్ని విషయాల్లో తగ్గాలి కదరా అన్నాడు కిషోర్. అసలు మనమేమీ అదగట్లేదురా. అయినా అమ్మాయి తరపు వాళ్ళ ఎక్స్పెక్టేషన్ తగ్గడం లేదు. ఒకటే కాదు. ఎన్ని సంబంధాలు చూసినా అదే కండీషన్.


అబ్బాయి సాఫ్ట్ వేర్ జాబ్ చెయ్యాలి. జీతం నెలకు లక్ష రూపాయలు ఉండాలి. ఒకవేళ పర్మినెంట్ గవర్నమెంట్ జాబ్ అయితే ఏదో ఫరవాలేదన్నట్లు మాట్లాడుతున్నారు అని గుక్క తిప్పుకోకుండా చెప్పాడు రాజీవ్.


మరి మనలా ఫీల్డ్ జాబ్స్ చేసేవారి పరిస్థితి ఏంట్రా. నేను పదో తరగతిలో ఉన్నప్పుడు విన్నాను ఈ సాఫ్ట్ వేర్ పెళ్లి కొడుకుల డిమాండ్. ఇప్పుడు నాకు పెళ్లి వయసొచ్చింది. ఇంకా రావడమేమిటి నా మొహం. నాలుగు జాబ్స్ మారి ఈ మాత్రం శాలరీ తెచ్చుకునేటప్పటికి వయసు ముప్పై దగ్గర పడుతోంది. అసలు ఇకపై పిల్లలకు చదువుకునేటప్పుడు ఉద్యోగం కోసమే చదువు అని కాదు రేపు మీరు పెళ్లి సమయంలో ఇబ్బంది పడకూడదు అంటే సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు తెచ్చుకోండి అని నేర్పాలేమో అని అన్నాడు కిషోర్.


జాబ్ పరిస్థితి ఎప్పుడూ ఒకేలా ఉండదురా. కానీ జీతం ఎక్కువ అనే ఫీలింగ్ అంత సులభంగా పోదు. ఈ రెండిటి మధ్యన పెళ్లి సంబంధాలు చూస్తున్నారు అంటే అదేదో అశ్వమేధమో రాజసూయమో చేసినట్లే ఉంటుంది కుటుంబాలకు అని నిట్టూర్చాడు రాజీవ్.


Rate this content
Log in

Similar telugu story from Abstract