ఆపన్నహస్తం
ఆపన్నహస్తం
తెలతెలవారబోతోంది
రామనాధం రోజూవెళ్ళే మార్నింగ్వాక్ కోసం బయలుదేరాడు
తలటోపీ, చేతిలో వాకింగ్స్టిక్ తో నెమ్మదిగా నడక సాగించాడు
అలవాటుగా మృత్యుంజయ మంత్రం జపిస్తూ కదిలాడు
రామనాధం నడక వేగం పెంచాడు
పేవ్మ్ంట్ మీదే నడక
జనం ఎక్కువ లేరు
గతం గుర్తుకొచ్చింది
కొడుకు వృద్ధిలోకి వచ్చి బాగా సంపాదించాడు
భార్య సీత, తను కొడుకు గొడుగు నీడలో కాలం గడపుతున్నారు
పెన్షన్ డబ్బులు యాత్రలకు, దానధర్మాలకు ధారాళంగా సరిపోతోంది
ఆలోచిస్తూ రెండు కిలోమీటర్ల లెక్క పూర్తి చేశాడు
తిరుగుముఖ
ం పట్టి రోడ్ క్రాస్ చేయబోయాడు
స్పీడ్ గా వస్తున్న స్కూటర్ ఢీకొట్టి వెళ్ళడం అటుగావెళుతున్న వ్యక్తి చూశాడు
రామనాధం స్పృహలో లేడు
వెంటనే ఎలానో 10 నిముషాలలో హాస్పిటల్ లో చేర్చాడు ఆ వ్యక్తి
డాక్టర్లు వెంటనే అటెండ్ అయ్యారు
కొడుకు వచ్చి గాబరాపడి డాక్టర్ నడిగాడు
వెంటనే హాస్పిటల్ లో చేరినందున ప్రాణం దక్కిందని చెప్పాడు
రిసెప్షన్ కెళ్ళి అడిగాడు కొడుకు
ఉదయం 5.40 నిముషాలకు ఎవరో ఆటోలో తెచ్చారనిసమాధాన మిచ్చారు
నాన్న నిత్యం జపించే మృత్యుంజయ మంత్రం రక్షించినది అని నమ్మాడు.