వ్యాపారం.....శ్రీనివాస భారతి
వ్యాపారం.....శ్రీనివాస భారతి


మిమ్మల్ని
దోచేసి
మాలోనే దాచేసే
కొత్త మంత్రం
చదువు
వైద్యం
ఈ రెండూ
మా చేతుల్లో
ఉన్నంతకాలం
మమ్మల్ని
ఎవరేం చెయ్యలేరు
అధికారానికి
మేం
దగ్గరి బంధువులం
పన్నుకు మాత్రం
దూరపు చుట్టాలం
ఇంకా అడిగితే
వాళ్ళెవరో
మాకస్సలు తెలీనే తెలీదు..
ఇరవై
అంతస్తుల బిల్డింగ్ నుండి
కిందకు చూడాలని
కోరుకొంటారా ఎవరైనా!
------౭౭౭౭౭౭౭౭౭------