వసంత పంచమి - కవితా సౌరభం
వసంత పంచమి - కవితా సౌరభం


వసంత లక్ష్మి పుట్టిన రోజు
జగన్మాత అంశయైన విద్యా లక్ష్మి పుట్టిన దినము
జీవితాన్ని వెలిగించే జ్ఞాన ప్రదాత్రి ,విరించి పత్ని
వాఙ్మయం లో మేటి అధిదేవత సకల కళల జగద్ధాత్రి
అష్ట లక్ష్ముల్లో వెలుగొందే విద్యా లక్ష్మి జీవిత మార్గాన్ని చూపే దేవి.
తెల్లని పద్మములో ,తెల్లని వస్త్రములతో ప్రకాశించే మారాళ వాహిని .
బాసరలో జ్ఞాన సరస్వతి గా , కాళేశ్వరం లో ప్రౌఢ సరస్వతి
గా , కాశ్మీరంలో శక్తి పీఠ అది దేవతగా
శృంగేరి లో శారదా పీఠ అది దేవతగా శ్రీ చక్రం అనుసంధాయిని గా ప్రతిష్టింప బడిన మాతృ దేవత
ధన లక్ష్మి కే మార్గదర్శిగా , స్మృతి పథాన కార్య దర్శిగా , విద్యార్థులకు అక్షర దేవిగా , కవి , గాయకుల గాత్ర రాణివై
వసంత పంచమి నాడు పుట్టిన విజ్ఞాన విశారద గా ఆవిర్భవించిన వాఙ్మయ సుందరి వై వెలిసిన దేవి .
కాళిదాస , రామకృష్ణులకు కవితా జ్ఞాన బోధ చేసిన విద్యా సరరస్వతివై జ్ఞాన ప్రవాహమునకు ఆది శక్తిగా
సకల ప్రాణులకు నవ జ్ఞాన చైతన్యమును కలిగించే మాతంగ కన్యా శ్రీ భారతి దేవి కి నమః సుమాంజలులు .