వరుస ఉత్తరం
వరుస ఉత్తరం
ప౹౹
వరుస ఉత్తరమే రాస్తున్నానే వరించను
వరస కోసం చేరవా మదినే సవరించను ౹2౹
చ౹౹
కోరి రాశాక కోరిక చల్లారదే ఇసుమంతా
జారి ప్రేమలోకి జరిపించై ఆ క్రతువంతా ౹2౹
మనసుకెందుకో మారామూ మరులతో
ధనసుగురిలా దరిచేర అన్నివనరులతో౹ప౹
చ౹౹
చెంతనిలిచిన చింత తొలుగే చిగురంత
అంత భాగ్యం అదనులో కలగ ఓ వింత ౹2౹
ఎంతదూరమో ఎదురీదా ఎలమి కోసం
కొంత ఓదార్పే మారిన మదిలో నివాసం ౹ప౹
చ౹౹
పలుమార్లు పలుకరించ ప్రయత్నించగ
పలువరుసైనా కన్పించకా యత్నెంచగ ౹2౹
అందుకే రాసుకుంటున్నానులే ఈ లేఖ
అందుకొని అందిచూ వలపూ కాదనక ౹ప౹