వలసకూలీలం
వలసకూలీలం
రోడ్లెమ్బట నడుస్తుంటూ
పిల్లలను మోసుకుంటూ
కష్టాన్ని మింగుకుంటూ
సొంతూళ్లకు వెళుతున్నాం..
పట్టెడన్నం పెట్టి మరీ
పేపరోళ్ళు అడుగుతుండ్రు
ఏ ఊరికి పయనమని
ఎప్పటికెళతారని
కోట్లల్లో ఉన్నాము
వలసకూలీలైన మేము
శ్రామిక రైళ్ల లేమో
పన్నెండు వందలేమో
మా ఊరికి వెళ్ళేకి
నెలల సమయం కావచ్చు..
బస్సేమో విడువరాయే
అందుకే నడుస్తున్నాం రోడ్డెమ్బట, పట్టాలవెంట..