వలపు మబ్బు
వలపు మబ్బు
వలపుమబ్బు కురిసినపుడు నీవు తడిసి పోలేవా
నెెఱియలున్న నా మనసును కొంత తడిపి పోలేవా
విషాదాల గతంలోకి తొంగిచూసి విలపించకు
సంతసాలనిచ్చు నన్ను చూసి మురిసి పోలేవా
ప్రేమజలధిలో కలిసే నదిలా కనిపిస్తావే
వలపించిన ప్రియుని కడకు నీవు కదలి పోలేవా
ప్రియుని చూపు సోకినపుడు ప్రేమ తెలిసిపోను కదా
వాలుకనుల సైగలతో బదులు పలికి పోలేవా
ఏ కాంతను మెచ్చలేను అప్సరలకు లొంగలేను
నన్ను తప్ప అందరినీ నీవు మరచి పోలేవా
స్వయంవరం ప్రకటిస్తూ కన్యకలను పిలిపించా
నాకోసం చెరకువిల్లు వంచి విరిచి పోలేవా
అగరుపొగలలో మునిగే రాత్రులలో
విరహం చితి చేరేలా నన్ను కలిసి పోలేవా

