Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Ramesh Babu Kommineni

Romance

4  

Ramesh Babu Kommineni

Romance

వివరం చెప్పాలిలే

వివరం చెప్పాలిలే

1 min
30


ప౹౹


వింత ఏదో కళ్ళలోనే మరి కనుగొన్నానులే


కొంత కొత్తగా ఉందిలే అని అనుకొన్నానులే ౹2౹


చ౹౹


ఎందుకో ఆ మెరుపెందుకో చెప్పాలిలే తప్పదే


పొందికే పొదివిపట్టి అదిమిపెట్టాలన్నా ఒప్పదే ౹2౹


గుండెలో గూడుకట్టిన వివరమే ఇక విప్పాలిలే


కొండలా కోరికనే పెంచక విషయమే చెప్పాలిలే ౹ప౹




చ౹౹


పిడికెడు హృదయంలోనే పిందె లేసిన ప్రేమని


అలికిడిలేని ఆగమనంతో చిగురించని ఆమని ౹2౹


దాచి దాచిన ఆ దాపరికపు దాగుడుమూతలు 


వేచి చూచిన వేసారే చిత్రమైన పడుగు పేకలు ౹2౹



చ||


విరగపూసిన విభ్రమను విందుగా చూపాలిలే


తరగలేసిన ఆ తనువునూ తన్మయించాలిలే ౹2౹


నచ్చిన ప్రియుడే వచ్చినే వలచినా వలపుతో 


మెచ్చిన మనసు నిండదా తీయని తలపుతో ౹ప౹


          

      







            

    



Rate this content
Log in

Similar telugu poem from Romance