విరహ వేదన
విరహ వేదన
నెలరాజు రాకను చూపుల్లో దాచకే,
గూడుచేరు గువ్వల
మనసు తెలుసుకోవే.
ఎడబాటు గాయాలతో
గుండెనే గుచ్చకే,
స్వప్నంలోని ఆనందం
కనులముందు నిలపవే,
ఆశల వెన్నెల్లో
విరహం నింపకే,
పరిమళ వలపుకు
నిదుర రానీయకే.
వాలు చూపులు
తనువు తాపం తీర్చవే,
నిందలన్నవి నమ్మకే
మౌనానికి వీడ్కోలు పలకవే,
నా పెదవి పలికేటి తీయదనంలో
ఆరాధనే వినవే,
సుందర దరహాసపు సొగసుతో
నన్నేలుకోగా రావే

