STORYMIRROR

Gayatri Tokachichu

Classics

4  

Gayatri Tokachichu

Classics

విలువైన విషయాలు

విలువైన విషయాలు

1 min
293

కాలుష్యరహితమౌ కాలమే వస్తుంది
 వీలుగా మనకింత పెన్నిధిని తెస్తుంది

 మన్నులో పుట్టాము మన్నులో పెరిగాము
 మన్నులో నుందిలే మాహాత్మ్యమన్నాము

 వసుధ మనకిడును సౌభాగ్యసిరిసంపదలు
మిసిమితో వెలుగొందు మేదినీ దీపికలు

 కన్నభూమి పదములు కైమోడ్చి మ్రొక్కెదము
దన్నుగా నిలుచుండి దాస్యమును చేసెదము

 తెలిసికొను జనులెల్ల తెలివితో మెలిగారు
విలువైన విషయాలు విశదీకరించారు

 ప్రాత పద్ధతులెపుడు ప్రగతి నందించులే
 జాతినే నడిపించి జ్ఞానంబు నొసగులే

 అవ్వతాతల బాట యాదర్శ మౌతుంది
ఆ దూరదృష్టి మనకాలంబనౌతుంది

 నేర్చుకుందాములే నేర్పుతో చదువులను
తీర్చుకుందాములే ధిషణతో కోరికలు.// 


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Classics