వగరైనా నారి
వగరైనా నారి
మనసు ఎందుకో మారం చేస్తుంది
"పొగరు " ఉన్న నా పోరీని పదే పదే చూడాలని
మూసి మూసి నవ్వులతో ముచ్చట్లు చెప్పే
"వగరు " ఐన నీ పదాల పదానిసలు వినాలని
తుంటరి తలపెదో తరుముతుంది
మన మీరువురం "సరస" సల్లపాలలో తెలియాడాలని
మన మధ్య జరిగిన తుంటరి ఊసులన్నీ పోగేసి
ఒక "సమీక్ష" గా నీకు కానుకనివ్వాలని
నీకు చూపాలని ఉంది నా ఊపిరిలో నిండి ఉంది నువ్వెనని
నీతో గడిపిన క్షణాలు గుర్తుకు వస్తే ఈ జన్మ ధన్యం అనిపిస్తుంది
నువ్వు చెంత లేని నిమిషం ఈ జన్మ వ్యర్థం అనిపిస్తుంది
అనుక్షణం నీ ధ్యాసే నా ధ్యానమై పోయిన్ది
ఏమి మాయ చేసావే "పొగరైన" పోరి
"వగరైన " నారి
నీ "సరస"పు చూపుతో నా గుండె చేశావు చోరీ!!

