Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Ravisankara Sarma Evani

Romance

4.5  

Ravisankara Sarma Evani

Romance

వెతుకులాట !

వెతుకులాట !

1 min
204


రోజూ సూర్యోదయంతో మొదలు

కనులముందర ఊహల్లో

ప్రేయసికోసం ఆత్రంగా వెతుకులాట .

కాగితంపై ప్రేమలేఖ వ్రాసేందుకు

ఆలోచనల మేఘాల్లో

లలితమైన పదాలకోసం వెతుకులాట .

ఆ అందమైన మోములో

ఉసిగొలిపే కనులతో

చిలిపిగా చూసే చూపులకోసం వెతుకులాట .

లేతగులాబీ సొగసులను తలపించే

అధరాలపై మురిపించే

నవ్వులకోసం వెతుకులాట .

ముచ్చటైన బొమ్మలోని ముద్దుగుమ్మలా

వయ్యారాన్ని ఒలికించే

నడకకోసం వెతుకులాట .

రారమమ్మని పిలిచే సైగలు

ఎప్పుడా అని తదేకంగా

మనసుతో ప్రతినిమిషం వెతుకులాట .

తియ్యని కోర్కెలతో నవమన్మధుడైన

ఒక యువకుడు

తన సుగుణాలరాశి మృదుస్పర్శకోసం

ఆశగా వెతుకులాట .



Rate this content
Log in

Similar telugu poem from Romance