STORYMIRROR

Midhun babu

Romance Classics Fantasy

4  

Midhun babu

Romance Classics Fantasy

వెంటాడే నువ్వు

వెంటాడే నువ్వు

1 min
11


ఆహా ఎంతటి ప్రశాంతత ఏమి ఆ చిరునవ్వు 

నీ ముసిముసి నవ్వులతోనే మమ్ము మరిపింపజేతివా

 ఏ స్వర్గసీమ చేరుకుంటివయా నీ జ్ఞాపకాలతో మమ్ము జీవించమంటివా……… 


నీ మనసు వెన్న.మాట కఠినము ఎంతటి బాధను అనుభవించితివో కదా... 


ఈ అంతులేని సంసార సాగరములో పడి ఆ నీ బాధను సైతము

 పట్టించుకోనైతివా ఓ మహానుభావా!!!


గుండెను పిండించే నీ బాధ నిన్ను పట్టి పీడిస్తున్నా చిరునవ్వుతో... 


ఒక్క చిరునవ్వుతో జయించావు చెరగని నీ చిరునవ్వుని నీ చివరి

 సందేశంగా ఇచ్చావు………


ఏది ఆ కోపము ఏది ఆ కాఠిన్యము అంతులేని సుదూర తీరాల పయనానికి వెళ్ళిపోయావా నీ జ్ఞాపకాలు మిగిల్చి మాకు………


 నీవు మాత్రము ఆహుతి అయ్యావా ఎన్ని జన్మలెత్తినా నీ చిరునవ్వు 

మమ్మల్ని వెంటాడుతునే ఉంటుంది. వెంటాడుతునే ఉంటుంది.


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance