STORYMIRROR

Midhun babu

Romance Classics Fantasy

4  

Midhun babu

Romance Classics Fantasy

వెన్నెల రాత్రి

వెన్నెల రాత్రి

1 min
12

వెన్నెల కురిసిన రాత్రిలో మల్లెలు పరుచుకున్నాయి.,
మనసారా ఓ ముద్దు ఇమ్మంటు వేడుకున్నాయి... 

ఆ చక్కని చుక్క ఇచ్చే ప్రతి ముద్దుకి,
సాక్ష్యంగా నిలవాలని చుక్కలన్ని కలసి 
దిక్కులని కాపలా కాస్తే....

చందమామే విరహలకి వేదిక ఐతే,
ఆ నీలినింగి దుప్పటి ఐ, ఆకాశం అంతా పరిచింది.

రెండు తనువుల స్పర్శలో పుట్టిన వేడిని
అగ్ని పర్వతం లా భూమి దాచింది...

అలా ఒకరికి ఒకరు ఆ రాత్రి,
రతి లో ఇద్దరూ, ఓడిపోతూ గెలిచారు... 

 ఆ విజయానికి సంబరంతో
మేఘాలు ఉరుములు మెరుపులతో ఘర్జిస్తూ,
వర్షపు చినకులు కురిపించాయి...


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance