వెన్నెల పూల దారుల్లో
వెన్నెల పూల దారుల్లో
నిశి రాతిరిలో మెరిసేటి తారకల సాయంతో దారీతెన్నూ తెలియని ఎగుడు దిగుడుల పయనంలో ముళ్ళ పొదల బాటలలో కష్టాలకు వెరవక కన్నీటి సంద్రంలో ఎదురీతతో నష్టాలకు బెదరక నడిచే ప్రతి అడుగూ కొత్త దారుల దిక్సూచిలా పడిలేచిన కెరటంలా ప్రకాశించు సూర్యునిలా అందమైన భవిష్యత్తు కోసం నిరంతరం తపన పడుతూ ఆకాశమే హద్దుగా విజయం వరించేదాకా విశ్రమించక పున్నమి వెన్నెల పూల దారుల్లో గజవాహన అంబారీపై ఊరేగే రాజువై జన నీరాజనాలు పడుతుంటే నిన్ను గేలి చేసిన మరుగుజ్జులకు మార్గదర్శిలా ఆకాశంలో చంద్రుడిలా వెలుగును పంచు అను నిత్యం..
