STORYMIRROR

Midhun babu

Classics Fantasy Inspirational

3  

Midhun babu

Classics Fantasy Inspirational

వెలుగుదివ్వె

వెలుగుదివ్వె

1 min
36


కడదాకా వెలగదుదివ్వె కొడిగట్టుకు పోదామరి

ముడివేసే పవిత్రబంధం విడిపించుకు పోదామరి 


మనిషి జన్మ వేదిక పై ఎన్ని నాట్య వైచిత్య్రాలొ

పాత్రముగిసి పోవగానె తెరదించుకు పోదామరి 


నీదికాని సంపదకొరకు పరుగులెందుకో"చల్లా "

కడకు తనువు కుంగిపోయి దహియించుకు పోదామరి 


బంధుకోటి అనుబంధం ఎన్నినాళ్ళు సాగుతుంది

భజనచేస్తు భోంచేస్తె హరియించుకు పోదామరి 


మూడునాళ్ళ ముచ్చటయే అమ్మకట్టె ఎముకల 

గూడు పంజరంలొ రామచిలుక చెరతెంచుకు పోదామరి


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Classics