వచన కవిత రుబాయి - కవీశ్వర్
వచన కవిత రుబాయి - కవీశ్వర్


ఎందుకనో ప్రకృతి సమస్యల కీ విచారం
పరికించిన కవికి కలుగును సులభతరం
కలం కదిలించిన జరుగును కవితా కౌశలం
జీవిత గమ్యంలో విషయమౌను మనోరంజితం
ఇదే ఇదే కన్నుల ప్రతిక్రియ భావాల సంబురం ......
భావనలు చెప్పును ఆలోచన తరంగాల వచన కేళి
మది తెలుపును ఆచరణ ప్రతి క్రియల సంగమ ప్రహేళి
కనులన్ పరికించిన ఆత్మీయ భావనల చిత్ర రచనల రంగేళి
కవిజన కావ్య కన్యకా రూప సోయగమ్ముల అపురూప చిత్రకేళి
అదే అదే తలచి పాఠక జనుల మది పులకింతల అంబరం......
పెదవుల వెలువడున్ నవజాత భావనల రసచందనం
శరీరాకృతి కనిపించున్ నవవిధ భంగిమల సౌష్ఠ చందం
లీలగా అగుపించును శిల్ప కళా కన్య నృత్య శ్రవణ బంధం
చిత్రించిన కలుగును గతవైభవ జీవన చైత్ర వర్ణ కదంబం
ఏదో ఏదో కలిగెను రసభావగీతి పలువిధముల సుందరం .....
నీవే నీవే ఆ కావ్య కన్యక !