వాసక సజ్జిక
వాసక సజ్జిక


మత్తేభము
పడకన్ పద్మదళమ్ములన్ బరచి పుష్పంబుంచిద్వారంబులన్
పడకింటన్ రమణీలలామకదిలెన్ప్రాణేశునిన్ దల్చివా
ల్జడకున్ పూవులగూర్చివేచెహృదయోల్లాసంబులన్ గూర్చగా
వడిచేరన్ జనుదెంచుప్రేమికునికైస్వాలంకృతస్త్రీత్వమై
గాదిరాజు మధుసూదన రాజు