STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

ఉన్నాలే నీ కోసం

ఉన్నాలే నీ కోసం

1 min
4

ఉన్నాలే నీకోసం... ఊపిరిగా మారుతానులే!
నువ్వే నా ప్రపంచం... నీలోనే బతుకుతానులే!
గుండెల్లో దాచుకున్నా... నా ప్రాణం నీవేనమ్మా,
ఎందుకో దూరాన ఉన్నా... నీ తలపే వదలదమ్మా!
నీ నవ్వుల వెలుగుల్లో... నా రోజూ మొదలవుతుందే,
నీ కళ్ళలోని చూపుల్లో... నా మనసే కరిగిపోతుందే!
ఏనాటి బంధమో ఇది... ఏ జన్మ పుణ్యమో ఇది,
నువ్వు లేని క్షణము నాకూ... నరకంలా అనిపిస్తుందే!
కాలాలు మారినా గాని... నా ప్రేమ మారదమ్మా,
ప్రాణాలు పోయే దాకా... నీ తోడే వీడనమ్మా!
నువ్వే నా సర్వస్వం... నువ్వే నా గమ్యం,
మనమిద్దరం ఒక్కటయ్యే... ఆ రోజే నా జన్మధన్యం!


Rate this content
Log in

Similar telugu poem from Classics