STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

కాల విహంగం

కాల విహంగం

1 min
6


కదిలే కాలం అహర్నిశల ప్రయాణం,
ఆద్యంతం లేని అనంత దారులలో.
చీకటి వెలుగుల రెక్కల సవ్వడిలో,
నిత్యం సరికొత్తగా ఉషోదయ విహంగం!

సృష్టికి ప్రతిసృష్టిని చేస్తూ,
నిత్యనూతన యవ్వన కాంతిలా తిరుగుతూ...
అమృతాన్ని గ్రోలిన అమరమూర్తిలా,
నిరంతరము చలిస్తూ సాగే సుమధుర దృశ్యం!

ఆకలి ఎరుగని అనంతపు నిశిలో,
కంటికి కనిపించని విశాల యాత్రలో...
నీలికళ్ళ సంద్రపు చీకటి స్వర్గపు మూలన,
కోట్ల కళ్లతో నిరీక్షించే పక్షుల్లా తిరుగుతోంది!

కలం సృజించని విశ్వ పుత్రిక,
ఏ ఊహలకందని స్వప్న కాళిక.
కాలరాత్రి కదిల్చిన సౌందర్య మాలిక,
ఎందరిని మింగిందో,..మరల ఎందరిని ప్రసవించిందో కదా!

చెప్పేదేముంది... నిత్య చైతన్య కిరణం,
లెక్కలు తేలని గతకాలపు జీవనం.
ముందు ఎంత ఉందో చెప్పలేని ఆశల వలయం,
నా కలల పిపాసకు సరికొత్త సూర్యోదయం!



Rate this content
Log in

Similar telugu poem from Classics