నీ ప్రేమలో
నీ ప్రేమలో
నీప్రేమను మౌనంగా
నీ ఊసులను ధ్యానంగా
నీ తలుపులను నిశితంగా
మోస్తున్న నా హృదయానికి అలుపే లేదు
చూపులను తాకెంత దగ్గరగా లేకున్నా
నామనస్సుకు నీశ్వాస దగ్గరగా ఉంది
నానిరీక్షణలో నీవే వున్నప్పుడు
నువ్వు ఎప్పుడొచ్చినా నావాడివే కదా
తీరిపోనంత ప్రేమ ఉన్నప్పుడు
యుగానికి ఒక్కసారి అయినా పుడితేనేమి
మరుజన్మ మరీ మరీ కొత్తగా ఉంటేనేమి
కొత్తగా మన పాత మనసులు నవ్వుతాయేమో
