ఉండాలో
ఉండాలో
ఎవరికెవరు చూపగలరు..స్వర్గమెలా ఉండాలో..!?
ఎవరు నిర్వచించగలరు..అందమెలా ఉండాలో..!?
గొడవంతా జరుగుతోంది..చూచుతీరు లోపలనే..
ఏల పట్టి ఇవ్వగలరు..సహనమెలా ఉండాలో..!?
అనుభవాల కోవెలలో..దీపాలకు కథలెన్నో..
ఎవరు చెబితె తెలియగలరు..భావమెలా ఉండాలో..!?
అర్థమయ్యి కాకముందె..ముగుస్తుంది ఓ అంకం..
ఏవిధముగ చెప్పగలరు..సౌఖ్యమెలా ఉండాలో..!?
అరకన్నుల వెలుగుపూలు..కాల్చునుగా ఖర్మలన్ని..
ఏ మాటలు వాడగలరు..ధ్యానమెలా ఉండాలో..
