తోటలోకి
తోటలోకి
పట్టిపట్టి లాగకోయి..కాలాడని తోటలోకి..!
విషాదాల వినోదాల..తియతియ్యని తోటలోకి..!
ఓదార్చే చెలిఎవరో..వచ్చేనా ఉందెక్కడ..
రారమ్మని ఏం పిలువను..ఈ నవ్వని తోటలోకి..!
ఏ తాడుతొ బంధించిన..ఆగేనో ఈ మనస్సు..
పోవలదని చెప్పుటెలా..శాంతివ్వని తోటలోకి..!
వారించే ఉపాయమే..ఇవ్వమందు మందులాగ..
నిషేధించు టెలాగోయి..సుఖమందని తోటలోకి..!
నీ ఊహల పరవశాల..మధుశాలయె చాలందును..
ఎందుకులే ఏ కోకిల..మరి పాడని తోటలోకి..!
కలహించే పూవులెన్నొ..ముద్దిచ్చే ముళ్ళెన్నో..
ఏమైనా వెళ్ళలేను..అలరించని తోటలోకి..!

