STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

తొలి రేయి

తొలి రేయి

1 min
375


పలికెనీ మనసు మధుర భావనలు మూగగా మూగగా

తెలుపనీయదీ సిగ్గు సిరిమల్లె కోరికలూ సూటిగా

పలికెనీ మనసు మధుర భావనలు మూగగా మూగగా

తెలుపనీయదీ సిగ్గు సిరిమల్లె కోరికలూ సూటిగా....


ఎదురుగ నీవుంటే యెత్తి చూడలేవీ కళ్ళు ఏమిచేతునో

ఎద పొంగులే అదుపు తప్పెనే ఏమి ప్రభూ ఇక ఎటులనో ...


మదపమ మదనిస సనిదప పదనిస సా....

పలికెనీ మనసు మధుర భావనలు మూగగా మూగగా

తెలుపనీయదీ సిగ్గు సిరిమల్లె కోరికలూ సూటిగా....


గగనాన చందురుడు అటు దిక్కుగా పోడాయే

ఇటనున్న చందురుడు ఇటు వద్దకూ రాడాయే...


మా మానస మధురిమ సా మల్లియతో చెప్పనా పా పదనిస..

పలికెనీ మనసు మధుర భావనలు మూగగా మూగగా

తెలుపనీయదీ సిగ్గు సిరిమల్లె కోరికలూ సూటిగా....


పరువమే పొగచూప పరువశమే పొడచూప అడుగులే తడబడ

అందుకుంటీ ఆ చేయి ఆ రేయి అటులనే సాగగా...


మదప మదప మదప మదనిసా 

సాగర సంగమమే సజనునితో సంగమమే


తెలుపనీయదీ సిగ్గు సిరిమల్లె కోరికలూ సూటిగా....


Rate this content
Log in

Similar telugu poem from Romance