తనువు
తనువు
ప౹౹
నువ్వొస్తావని నువ్వొస్తావని ఎదురు చూసాను
కవ్విస్తావని కవ్విస్తావని వలపే ఎదను దాచాను |2|
చ||
ఎంత సౌఖ్యమో ఎడదనే మీటిన సుఖ క్షణాలు
అంత భాగ్యమే అమర్చినే దీటుగా ఆ లక్షణాలు |2|
మదికి స్వాంతనమే మరల మరి కూర్చే వీక్షణం
ఎదను ఎలిమే వెంటనే నింపెగ ఆ వలపు తీక్షణం |ప|
చ||
కావ్య నాయికవై నవ్య రూపంతో నీ వరుదెంచగా
దివ్య వాహికవై రసరమ్య పూజల్లు కురిపించగా |2|
ఎడారి చినుకే ఎలబారి ఎద మొత్తమే ముంచగా
కటారి పలుకే కలహంస కులుకై ప్రేమనే పంచగా |ప|
చ||
ఎక్కడో గుండెలో ఏమూలో చిత్రమై గుచ్చుకొందే
అక్కడే నిండుగా మరులు మాలికలై విచ్చుకొందే |2|
పులకించి మనసూ పురివిప్పే హేల అణువణువు
నడిపించి వయసూ కనుగప్పే ఆ కులుకు తనువు |ప|