"తను"
"తను"


కంటిపాప కలవరపడెను కనిపించని తన జాడకై
కర్ణభేరి కట్టిపడెను వినిపించని తన ఊసుకై
మాటే మూగబోయేను పలకని తన పేరుకై
శ్వాసే స్తంభించేను సృతించని తన సవ్వడికై
గూడు లేని గగనంలో చుక్కలా చేరదీస్తారని !
తోడు లేని భువనంలో అక్కున చేరతారని !
నీడ లేని నడిరేయికి వెన్నెలలా కనిపిస్తారని !
వీడ లేని బంధానికి వెన్నంటే నిలుస్తారని !
ఆశించేను నా హృదయమే !
తన రాకకై తపన పడుతున్న మదితో...
ఆలోచనలో ఆరాధనని అక్షరాలుగా అందిస్తున్నా తనకై..
ప్రేమలో పలకరింపుని పదాలుగా పంపిస్తున్నా తనకై..
వాత్సల్యపు వ్యామో
హాన్ని వాక్యాలుగా విస్తరిస్తున్నా తనకై..
రెప్పమాటు రూపాన్ని రచనలుగా రచిస్తున్నా తనకై..
"అపార్థపు" సంగ్రామంలో "ధ్వేషమనే" శత్రువుతో "ఆశనే" ఆయుధం ధరించి తనకై నిరంతరం చేస్తున్న ఈ "ప్రేమ యుద్ధం"లో..
కడవరకూ తనతో పయనించాలనే ఈ కాంక్ష, కలలా మాత్రమే మిగిలి, ఓడి ఒంటరవనా...!
తన "కిరణ"పు కాంతిని నా "పవన"పు ప్రవాహంతో ప్రసరింప చేస్తూ, గెలిచి తనతో జతకాగలనా...?
✍️సత్య పవన్✍️