తను నా కవితగా
తను నా కవితగా
తను నా కవితగ..మిగిలెను మదిలో..!
చెలిమికి శ్వాసగ..వెలిగెను మదిలో..!
చూపులు పరిమళ..భరితం చేసెను..
లేఖలు వ్రాయగ..ముసిరెను మదిలో..!
అలుకల నదినే..గగనము చేర్చెను..
నవ్వుల తోటగ..విరిసెను మదిలో..!
కోకిల గళమున..శృతిలయ లేవో..
సరాగ మాధురి..నింపెను మదిలో..!
చీకటి గుడిలో..చిన్ని దీపమే..
వెన్నెల వాగై..సాగెను మదిలో..!

