STORYMIRROR

Midhun babu

Classics Fantasy Inspirational

3  

Midhun babu

Classics Fantasy Inspirational

తంత్రులలో

తంత్రులలో

1 min
4

ఎన్ని వ్యథలు దాగినవో..విరహవీణ తంత్రులలో..!?

కలలగీతి ఏమాయెనొ..సరసవీణ తంత్రులలో..!?


పరిహసించు ఎదురుచూపె..వరమైనది వసంతాన.. 

రాలుపూల పరిమళాల..స్నేహవీణ తంత్రులలో..!?


తన పెదవులు దాటలేని..మాటలెన్నొ మౌననిధిని.. 

చెప్పరాని ఆ పదముల..భావవీణ తంత్రులలో..!?


భోగభాగ్య వైభోగపు..వారథి కద ఈ వెన్నెల..

కరిగిపోని తరిగిపోని..హంసవీణ తంత్రులలో..!?


నీ అద్భుత ధ్యానంలో..కురియు పసిడి రసమేద..

రసవాదము పండించే..హాసవీణ తంత్రులలో..!?


Rate this content
Log in

Similar telugu poem from Classics