తనసహనం
తనసహనం
చెప్పలేను మాటలలో..తూచలేను తనసహనం..!
నేలతల్లి కెఱుకేమో..తెలుపలేను తనసహనం..!
సాధింపుల కేమున్నది..గాలిలోన కలిసేనా..
విచక్షణా దీపమదే..కొలువలేను తనసహనం..!
ఎవ్వరేమి అంటారో..ఎంత హింస పెడతారో..
చిరునవ్వే జవాబుగా..చెప్పలేను తనసహనం..!
మాటడక కర్తవ్యపు..లోగిలిలో నిలిచేనా..
మాతృత్వపు శిఖరమేను..చూపలేను తనసహనం..!
సంవేదన సాక్షిగతా..ఒక కురవని మేఘమేను..
సంద్రాలను దిగమింగును..వ్రాయలేను తనసహనం..!
వేనవేల కావ్యాలకు..అనాదిగా ఆధారం..
బంధాలకు అతీతమే..పొగడలేను తనసహనం..!

