STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

తనమేమో

తనమేమో

1 min
258


పెదవివిప్పి చెప్పేందుకు..వల్లకాని తనమేమో..!

లేఖ ఒకటి వ్రాసేందుకు..చేతకాని తనమేమో..!


ముసురుకున్న వలపుతేనె..మబ్బుతెరలు ఎక్కడివో.. 

కన్నులెత్తి చూసేందుకు..అంతకాని తనమేమో..!


కనకాంబర రాగాలను..శృతిచేయగ తరమౌనా.. 

సరసవీణ అయ్యేందుకు..వరుసకాని తనమేమో..! 


కురులుతాకి పరవశించు..ఆ గాలిని ఏమడుగను..

చెలిమివెన్న పంచేందుకు..మిగులకాని తనమేమో..!


కడలిఅలల కవ్వించే..వెలుగుపూల కథలెన్నో.. 

గగనాలను ఏలేందుకు..చేరకాని తనమేమో..! 


మరి మన ప్రేమకి..మరపించును జగములెల్ల.. 

మౌనంలో మునిగేందుకు..నిలువకాని తనమేమో..!


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance