STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

తన మౌనం

తన మౌనం

1 min
314

గుండెగొంతు లోని పాట..తన మౌనం ఒలికించును..

ప్రేమించే చెలిమనస్సు..మధురముగా పులకించును..! 


మాట కన్న విలువైనది..ఏమున్నది ఓ నేస్తం.. 

ఒక తియ్యని పలకరింపు..చాలుకదా మురిపించును.!


చెలి విరహమె కానుకగా..తలపోయగ కుదిరేనా.. 

కలలోనూ చిత్రముగా..అల్లుకొనుచు కవ్వించును..!


మట్టి పంచు మాతృత్వపు..అనుభూతికి మాటలేవి..

చినుకుతోటి అనుబంధమె..రాగాలను పండించును..!


గాలికన్న విలువైనది..లేదన్నది నిజము కదా.. 

నీ మనసుకు ఆ ఈశ్వర..సంధానము జరిపించును..!


కాంతిపూల వనమున్నది..అంతరంగ గగనంలో.. 

చెలి ప్రేమను చవిచూపే..దీపరాశి కరుణించును..!


అక్షరాల పూలవాగు..ప్రవాహమే మధువుకదా..

చెలి చూపే సోకిందా..ప్రతిభావం చిగురించును..!


నిత్యచెలిమి మంత్రముంది..తన అందెల సవ్వడిలో.. 

పరిమళించు మధుగీతం..పదేపదే వినిపించును..!


వ్రాసేందుకు ముషాయిరా..తోడున్నది వేదికగా.. 

నిదానమే ధనమైతే..పలుకుతీరు రాణించును..!



Rate this content
Log in

Similar telugu poem from Romance