తలపు
తలపు


ప౹౹
దర్పమెందుకే ఎదలో గుట్టు విప్పేందుకు
సందర్భమేలే మదిలో మాట చెప్పేందుకు ౹2౹
చ౹౹
సరసానికి సరిగమలు నేర్పేటి చూపులు
విరహానికి విరుగుడే లేదనే ఆ తూపులు ౹2౹
చూసాక సోయుగం గడిపానులే యుగం
తెలిసాక తన ప్రేమ పంచాలిలే చెరి సగం ౹ప౹
చ౹౹
గుప్పెడంత గుండెలో కొండంత కోరికేనూ
ఇప్పుడంత వివరిస్తే వినలేరూ ఊరికేనూ ౹2౹
గుట్టుచప్పుడు లేని ప్రేమా గుణవంతమే
గట్టుదాటని కేరింతలూ ఇక పలవంతమే ౹ప౹
చ౹౹
తనువుకి కలిగేది తరుగులేని తన్మయమే
మనుసుకి ఆ మైకమే పెంచేది చిన్మయమే ౹2౹
చిన్నగా విప్పరాదా చిగురించిన వలపును
మెల్లగాచెప్పి మెప్పించరాదా ఆ తలపును ౹ప౹