STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

తిరిగి రాని ఆ రోజులు

తిరిగి రాని ఆ రోజులు

1 min
0



పెద్ద పండగొచ్చింది... పల్లెటూరు పిలిచింది...
పిల్లా పెద్దా కదలండి... ఊరి బాట పట్టండి...
పచ్చని చెట్లు రమ్మంటున్నాయి... 
జోడెడ్ల బళ్ళు సిద్ధంగున్నాయి...
ఏటి గట్టు, శెట్టి కొట్టు... జడ్పీ స్కూలు, రాముడి గుడి...
పిల్లకాలువ, బండికోవా... సాయిబు అత్తరు, దేవుడి తేరు...
గురుతులెన్నో నీ కోసం చూస్తున్నాయి...
మనసులెన్నో రా అంటూ పిలుస్తున్నాయి...
రావోయీ పట్నం వెళ్ళిన చిన్నోడా...
రాదోయీ ఇంతకు మించిన పండగ...
శ్రీను గాడు, నవీన్ గాడు… మస్తాన్, ఆనంద్...
నీతో కలిపి పాండవులు… చేశారెన్నో చిలిపిచేష్టలు 
హిమబిందు ముగ్గులేస్తె… తొంగితొంగి నువ్వు చూస్తె... 
పిర్రమీద పడ్డ దెబ్బ... నడవలేక నీ కష్టం...
గోలీలాటోలతో నువ్వు… బాలకృష్ణ గాడితో గొడవ...
మాస్టారు బెత్తంతో... చేసిన ఆ బడితపూజ...
కళ్ళముందె కట్టినట్టు… రీల్లు తిరుగుతున్నాయి...
టెంత్ క్లాసు రోజులొచ్చె... మీసం కొత్తగ మొలిచె...
రెండు జడల అనూష... నీ గుండెల్లో భిషభిష...
ఎనకెనకే ఫాలోయింగు... పోస్టుకార్డు గ్రీటింగు...
స్కెచ్చులతో హార్టు గీసి... ప్రేమంతా ఒలకబోసి...
పగలు రాత్రి తిరిగావు... తన ఇల్లే కనిపెట్టావు…
ప్రేమంటూ చెప్పబోతే... రాఖీ కట్టి స్వీటు పెట్టె...
కళ్ళముందె కట్టినట్టు… రీల్లు తిరుగుతున్నాయి..
చదువులంటూ వెళ్ళావు... డిగ్రీ కోర్సు, ఉద్యోగాలు... 
ఊరే అయ్యింది దూరం... లేదు ఖాళీ సమయం...
ఆడిన ఆనాటి స్నేహితులు... ఒంటరైన అమ్మానాన్నలు...
నోరూరే బామ్మ బూరెలు... ప్రేమతో పిన్ని పకోడీలు...
ఎత్తుకు తిరిగిన అత్తమ్మ... జోల పాడిన నాన్నమ్మ...
నువ్వొస్తావు అంటూ... వేచి చూస్తూ ఉన్నారు... 
పనంటూ చెప్పద్దు... ఒక్కసారి వచ్చిపో... 


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Classics