STORYMIRROR

Ramesh Babu Kommineni

Romance

4  

Ramesh Babu Kommineni

Romance

తీయని తలపే..

తీయని తలపే..

1 min
258

తీయని తలపే తీరికచేసి తనే ముకుళించెనే

ఓయని పలికే రాగాల కోయిలగా రవళించెనే

వరదే వలపు రూపంలో వరసలూ కలిపేసినా

తీరదే గెలపు దాహం తీరాలే చేరి గోలచేసినా

పసిడి పరువానికి ఇక పరుగులూ తప్పవులే

చూసెడి నయనాలకే సొగసే తోడిక చెప్పకనే

తీయని తలపే తీరికచేసి తనే ముకుళించేనే

ఓయని పలికే రాగాల కోయిలగా రవళించెనే


కనులెంత మూసినా ఆ కలలను ఆపగలవా

పనులెంత మానినా పలవరింతలే ఓపగలవా

ఎదను చేరే ఎలమిలో ఎరుగని తేనెలే కలవు

పదును కోరికలు పల్లవించి పైపైకసలే తేలవు

ఎరవని సుఖం ఏకరువుపెట్టే సుడిలా నదిలో

మరువని సృతులే ఇక శాశ్వతమవు మదిలో

తీయని తలపే తీరికచేసి తనే ముకుళించెనే

ఓయని పలికే రాగాల కోయిలగా రవళించెనే

వరదే వలపు రూపంలో వరసలూ కలిపేసినా

తీరదే గెలపు దాహం తీరాలే చేరి గోలచేసినా


ఎంత మధురం ఆ అనుభవాలు నెమరేసినా

చెంత అధరం చేర్చి చెంగల్వమే ముసిరేసినా

ఎంత మధురం ఆ అనుభవాలు నెమరేసినా

చెంత అధరం చేర్చి చెంగల్వమే ముసిరేసినా

పసిడి పరువానికి ఇక పరుగులూ తప్పవులే

చూసెడి నయనాలకే సొగసే తోడిక చెప్పకనే

తీయని తలపే తీరికచేసి తనే ముకుళించేనే

ఓయని పలికే రాగాల కోయిలగా రవళించెనే



Rate this content
Log in

Similar telugu poem from Romance