Revolutionize India's governance. Click now to secure 'Factory Resets of Governance Rules'—A business plan for a healthy and robust democracy, with a potential to reduce taxes.
Revolutionize India's governance. Click now to secure 'Factory Resets of Governance Rules'—A business plan for a healthy and robust democracy, with a potential to reduce taxes.

Ramesh Babu Kommineni

Romance

4  

Ramesh Babu Kommineni

Romance

తీరమే దాటుతుంది

తీరమే దాటుతుంది

1 min
293

ప౹౹

తీరమే దాటుతున్నదే తీరికా లేని ఆ వలపే

భారమై మీటుతున్నదే ఎదనే తిప్పీ మలుపే ౹2౹

చ౹౹

లాహిరిలో లంగరే కుదరక కుడీ ఎడమవునే

పోకిరిలా తలపు పొటమిరించి పడవేయునే ౹2౹

ఎడబాటే ఎరుగని ఎలమిలో ఏదో జరిగెనూ

తడబాటే తారసిల్లి తనువులో అదేకరిగెనూ ౹ప౹

చ౹౹

జీవితమంతా జీ హుజూరే అనాలిగా ప్రేమకే 

కాగితమంతా రాసి కలలే పంచాలిగా లేమకే ౹2౹

జైకొట్టి జోకొట్టాలి పనిలో పనిగా ఆ ప్రమదనే

ఊకొట్టి ఊసులతో మెప్పించాలి తన మదినే ౹ప౹

చ౹౹

మనసులో మల్లెల గుభాళింపే చొప్పించాలిలే 

పనసలో తీయదనాన్నిచేర్చేసి మెప్పించాలిలే ౹2౹

సొగసులో సోయుగాన్నీ ఇక సొంతమే చేసుకో

వయసులో వయ్యారాన్ని వద్దనక దరిచేర్చుకో౹ప౹

Rate this content
Log in

Similar telugu poem from Romance