Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Eevani Ravisankara Sarma

Romance

4.5  

Eevani Ravisankara Sarma

Romance

తెరవాలని మది తలుపు !

తెరవాలని మది తలుపు !

1 min
739


రోజూ కొత్తకొత్త ఊహలతో

చెలిమది మీటాలనే నా ఆశలు ,

ఆమెను చూడగానే

ఉబ్బితబ్బిబ్బవుతూ అడుగులు .


ప్రేమగా పలికితే

పువ్వులా పూసే ముఖకవళికలు ,

కళ్ళలో ఆనందం ఒలికే

లేతవర్ణాల ఉషోదయకాంతులు .


ఊహించని ఆశ్చర్యంతో

గులాబీలు మొలిచే ఆమె చెక్కిళ్ళు ,

ఉత్సుకతను జోడించి

మీదికివాలు ఆ సొగసరి కురులు .


గిలిగింతలు రేగుతూ ,

ఊసులకు విశేషంగా స్పందిస్తూ

తళతళలాడు దుస్తులు ,

మెరుస్తూ బంగరు ఆభరణాలు .


ప్రేమపల్లవులకు హృదయం

పరవశించదా ఎప్పటికైనా అని !

మనసులు ఒకటై

మనమనే భావన కలగదా అని !!



Rate this content
Log in

Similar telugu poem from Romance