STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

తెలియవేమి

తెలియవేమి

1 min
2

జ్ఞాపకాల పూలతోట.. వేదించుట తెలియవేమి..!

లేని మరణయాతనలను..తొలగించుట తెలియవేమి..!


అసూయతో రగిలిపోవు..మనసే మరి శత్రువంటె..

ప్రతి కణమున పరమాత్మను..దర్శించుట తెలియవేమి..!


జీవితమొక ఆటలాగ..సాగాలని తలచేవే..

జరుగుతున్న నాటకమును..తిలకించుట తెలియవేమి..!


చాలినంత శక్తిలేకె..నీరసాలు చిరాకులోయ్..

శ్వాసమాటు చైతన్యం..పరికించుట తెలియవేమి..!


దేనికైన ఎవరికైన..బానిసయే పనే లేదు..

ఎఱుక అనే దీపమొకటి..వెలిగించుట తెలియవేమి..!


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance