STORYMIRROR

Midhun babu

Romance Classics

4  

Midhun babu

Romance Classics

తడిసిన జ్ఞాపకాల

తడిసిన జ్ఞాపకాల

1 min
223


మంచుపూల రోజులన్నీ.. 

కాలం ఒడిలో కరిగిపోతున్నా 

మనసును తడిపిన చల్లదనమంతా

ఙ్ఞాపకాలలో అపురూపంగా

దాచుకుంటున్నాయి!.. 


తన్మయంలో ముడుచుకుంటూ

హృదయంలోని వెచ్చదనాన్ని

వేడుకుంటున్నాయి ఈ తేమను 

ఎప్పటికీ ఆరనీయకని!.. 


ఒక మధురమైన అనుభూతి

మదిలో తేనె ధారలు 

కురిపిస్తూనే వుంది..నిన్నటి 

మన స్నేహ పరవశమేకదా! అది!.. 


అన్ని బంధాలనూ పుట్టించిన దైవం

విదుల్చుకునే అవకాశం

మనిషికెందుకిచ్చాడో!

ఎద గదులకు అంత ఇరుకేమిటో!?.. 


గుండె భారమైనప్పుడల్లా 

చక్షుజలధిలో పొంగుతున్న ఉప్పెనలు 

ఎన్ని పడవలను దాటించాయో

ఆవలి తీరపు అంచులకు చేరువగా 


నిన్నటి బాటసారి

రేపటి కలల అలలపై 

ఆశల చుక్కానిని 

ఆత్రంగా కదిలిస్తూ 

పయనిస్తూనే ఉన్నాడు!.. 


కాలానికి సమయస్ఫూర్తి ఎక్కువే 

గతం మిగిల్చిన గురుతులను 

ఏనాటికీ కడిగేయలేనని 

గంభీరంగా సాగిపోతోంది!.. 



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance