STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

స్వప్న సుందరి

స్వప్న సుందరి

1 min
0


నువ్వులా చూస్తుంటే అలసిపోవా నీ కనురెప్పలు,

నువ్వులా మాట్లాడితే అదిరిపోవా నీ పెదవులు,

నువ్వు పీల్చి వదిలిన గాలి పరిమళిస్తుంది,

నువ్వు తెరిచిన చెవులు ఆహ్వానం పలుకుతుంది.

నున్నటి నీ చెంపలు, వాటిపై ఏర్పడిన ఆ పుట్టుమచ్చలు

పట్టపగలే ఆకాశంలో చుక్కలు చూస్తున్నట్టుంది.

పొడవాటి నీ నాసికము, వాటిని ఆనుకున్న ఆ కనుబొమ్మలు

 చిన్న కొండల నడుము జారే జలపాతాన్ని తలపిస్తుంది.

మృదువైన పెదవులు, దానిని కదిలిస్తున్న ఆ కంఠస్వరము

 చెవిటివాడిని కూడా కదిలించేంత వినసొంపుగా ఉంది.

మెట్టలు లేని నీ కాళ్ళు సవ్వడి చేయకపోయినా...

నీ పాదముద్రలతో ఈ నేల పులకరిస్తుంది.

ఆభరణాలు లేక నీ మెడ వొంపు బోసిగా మారినా...

నీ కురుల తాకిడితో అది హోయలొలుకుతుంది.

గాజుల లేక నీ చేతులు వెల వెల బోయినా...

వాటిని పట్టుకుని నీతో చెలిమి చెయ్యాలని నా మనసు ఉవ్విలూరుతుంది.

ఇన్నేల్లొచ్చినా బహుశా నాకిప్పటివరకూ ఆడ వాసనన్నది తగల్లేకో మరి,

 లేక ఈ పల్లెటూరి మొద్దు ఇంకా ఈ పట్నపు పద్ధతులకు  అలవాటు పడకో మరి,

మీరెవరితోనో చనువుగా ఉంటే మాత్రం అదే మనసు ఎందుకో తల్లడిల్లిపోతోంది.

నీ అంద చందాలకి దాసోహమైన నా పిచ్చి హ్రుదయం అంతకుమించి ఈర్ష్య పడుతుంది. నీతో కలిసి నడిచిన ప్రయాణం కాస్త దూరమే అయినా

అది ఎన్నో తెలియని మధురానుభూతులు నేర్పిస్తుంది.

ఇంతకుమించితే ప్రమాదమో ఏమో అనిపిస్తుంది.

నా వాక్యాలు శ్రుతి మించితే మన్నించండి.

అసలు అర్థమే కాకుంటే క్షమించండి....


Rate this content
Log in

Similar telugu poem from Romance