STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

సరివానకు

సరివానకు

1 min
9


ఆగమంటు చెప్పలేను..కురుస్తున్న సరివానకు..! 
తడపకంటు పాడలేను..అల్లుకున్న సరివానకు..! 

తాళలేని తపనలన్ని..తనూలతకు కానుకలే.. 
మాయచేయ కోరలేను..పొంగుతున్న సరివానకు..! 

అనుభవాల గదినిదాటి..ఆకాశపు వీధులలో.. 
సాక్షిగాక ఉండలేను..పొంగుతున్న సరివానకు..! 

సరసస్వర మధురిమలవి..సరిగమలకు లొంగేనా..
ఆంక్షలేవొ పెట్టలేను..ముంచుతున్న సరివానకు..! 

కావ్యమేఘ రంజనియై..జాలువారు మనోహరియె.. 
సంకెళ్ళను వేయలేను..పట్టుకున్న సరివానకు..! 

ఎక్కడికని పారిపోను..ఎదురీదే పనిమానుకు.. 
గొడుగన్నది పట్టలేను..కాల్చుతున్న సరివానకు..! 


Rate this content
Log in

Similar telugu poem from Classics