Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Ramesh Babu Kommineni

Romance

4.8  

Ramesh Babu Kommineni

Romance

సన్నిధి

సన్నిధి

1 min
420


||

ఆమని ఓ ఆమని అలిగావా ఎదనే అడగాలని

ఏమని తనే ఏమని చెప్పును తననే పొగడాలని |2|

చ||

కలికి మనసులో వలికి వెన్నెల వెలసే వర్ణాలుగా

ఉలికి పడకే ఊరంతా చూడ ఓవింత తిర్ణాలుగా |2|

సాయం సమయాన సంధ్య మయాన సయ్యాట

న్యాయం నెరవేర్చ నెఱజాణ మదిలో కయ్యాట |ప|

చ||

తీపి గురుతులే తీరైన జ్ఞాపికలై నిలిచెలే మదిలో

తీయని కోరికలే త్రీవ్రమై తిరుగాడే ఆ ఎదగదిలో |2|

చెలికాడే చెంతకేగ చెలి పలుకే మారే సరాగమై

నులి వెచ్చనీ కౌగిలే గిలి పెంచే పూల పరాగమై |ప|

చ||

అంతరంగమే పూలపున్నమై స్వాగతించే అలా

స్వాంతనమే చేకూరగ చెలి మనసునే చేరెనలా |2|

అంతకంతకు పెరిగే ప్రేమయేగ ఇద్దరికి పెన్నిది

అనురాగం ఆశే పెనవేసే ఆ గుసగుసల సన్నిధి |ప|



Rate this content
Log in

Similar telugu poem from Romance