సంక్రాంతి శోభలు
సంక్రాంతి శోభలు
సంక్రాంతి శోభలు.
(బాలపంచపదులు )
ముసురుకొన్న చీకటిపరదాలు
పసిడి వేకువ తొల్గించ తెరలు
దివాకరుని యశ్వాల పరుగులు
భువిపై వెలుగు రేఖలు నింపగ
వచ్చెనానందాల వెల్లువ విజయా!/
భావి పథంలో జాతి పయనింపగ
వాడవాడల వేడ్కలు జరుపంగ
మూడుదినాల ముచ్చటైన పండగ
పాడి పంటలు ధరలో వర్థిలంగ
ఆయురారోగ్యాల నీయగ విజయా!/
దేశానికి బువ్వపెట్టెడి రైతులు
ఆశతో వేచి చూడ నుషోదయాలు
సైరికుల కీయ సస్యసంపదలు
పరుగున వచ్చె సంక్రాంతి శోభలు
మరిపించ కష్టనష్టాలు విజయా!/
జనుల హృదయాల నిండిన దిగులు
కనుమరుగయి కల్గు శుభములు
పల్లెపల్లెల విరిసే సంబరాలు
జల్లున కురిసే ఇంటింటా భాగ్యలు
స్వాగతించుదాము హాయిగా విజయా!//
