సామాజిక రచయిత (వచన కవిత )
సామాజిక రచయిత (వచన కవిత )
ప్రముఖ సంఘ సంస్కర్త త్రిపుర నేని రామస్వామి కుమారుడు.
ఆధునిక భావాలు కల రచయితగా, కవిగా నెదిగిన వాడు.
స్వతంత్ర భావాలతో జ్ఞాన సముపార్జనకై తపియించినవాడు.
తాత్విక చింతనతో తన ఆలోచనలకు రూపమిచ్చినవాడు.
సమాజంలోని సమస్యలను గాంచి సతమతమయ్యెడివాడు.
అసమర్థుని జీవితయాత్ర, మెరుపుల మరకలు రచించినాడు.
చిత్ర సీమలో ప్రవేశించి దర్శక నిర్మాతగా చరించినవాడు.
ఆంధ్ర ప్రభుత్వపు సమాచార శాఖాధ్యక్షునిగా పనిచేసినాడు.
ఆకాశవాణిలో బాధ్యతలు సమర్థ వంతంగా నిర్వహించినాడు.
పలు రచనలు చేసి ప్రజల మన్నన పొందిన మహోన్నతుడు.
పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామాతో ఖ్యాతి పొందినవాడు.
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును పొందిన వైజ్ఞానిక మేధావి.
అతడి తండ్రితో పాటు తపాలా బిళ్ళను విడుదల చేసింది ప్రభుత్వం.
త్రిపురనేని గోపిచంద్ తెలుగు వారికీ ప్రీతి పాత్రుడైన రచయిత.
సామాజిక స్పృహ కల్గిన రచనలు చేసి మెప్పించిన మానవతావాది.
తెలుగు వారి హృదయాలను గెలిచిన సద్విద్యా వివేకనిధి.//
