సంకల్పం
సంకల్పం
ప౹౹
నిబ్బరంగా నేనే నిలచున్నానే మొండిగా
నిర్భయంగా నేనే ఎదొర్కొన్నా ఒంటరిగా ౹2౹
చ౹౹
ఆందోళలోను వ్యాకులతనే తొలగించాను
సందేహంలేక సత్యం గెలిచేనని నమ్మాను ౹2౹
ధైర్యం కోల్పోక దైన్యంచేరనీక ఎదురీదాను
స్థైర్యం కూడగట్టి సమరమే మరీ చేసాను ౹ప౹
చ౹౹
కుట్రదారులు యంత్రాంగం కలిసి చేసాయి
కుట్రలే కుతంత్రాలే కావాలని కోరి చేసాయి ౹2౹
అనుసరించాను సహనమే ఆయుధంగాను
ఉపసంహరించాను కోపాన్నే సహజంగాను ౹ప౹
చ౹౹
కోరి కీడుచేయు వారికీ చెళ్ళుమంది చెంప
చేరి చెడకొట్టువారికి తెగినదే వారి దుంప ౹2౹
ఆ దైవమే అక్కునచేర్చి నను ఆదరించెను
సంకల్పానికి సహకరించి మళ్ళీ దీవెంచెను ౹ప౹