స్నేహపు గుర్తులు
స్నేహపు గుర్తులు
నిన్నొ మొన్నో నా ఎద చప్పుడుకు ఒక రాగం వినిపించిన వేళ
కాలం పరిగెడుతూ ఉంటే జ్ఞాపకాల వీలునామాలో.....
కొద్ధో గొప్పో కాదు గట్టి బంధమే లిఖించినది
ఏ క్షణాన మొలకెత్తిన బంధమేమో సాగుతూ.... సందడి చేస్తూ....
ఎన్ని సూర్యోదయాలను సొంపుగా మోసుకొచ్చిందో.....
ఎన్ని సూర్యాస్తమయలను సన్నిహితంగా పంచిపెట్టిందో....
పందిరిచాటున ఒక లేతకొమ్మ పలకరిద్దామని పరుగులుపెట్టి లతలతో అల్లెసిందో.....
వెల్లువలేని సంతోషాలను పూ రెమ్మయి చిలకరించిందో......
చీకటి వెలుగుల జీవితాన.....
ఒక చిరుదివ్వై వెలిగిన చెలిమి.....
జీ
విత సంద్రాన ఒక నావగా నను నడిపిస్తుందో.....
నా భావాలను ఒలికిస్తుందో...
అంతరంగపు ఝరిలో దాగిన ఆవేదన చల్లారుస్తుందో....
కెరటపు వల నుండి కాపాడే పల్లీయవుతుందో....
చిరుజల్లుల తొలకరివేళ స్నేహామాధుర్యాలతో తడిపేస్తుందో....
సరాగాల లీలాగానం హిందోళరాగంలో కలసి పుష్ప సుగందాలను మైమరపించినవేళ...
సంతోష సిరిమువ్వలలో లీన మై నను నడిపివేళ....
స్నేహానికి ఉషోదయాలే కానీ అస్తమయాలు ఉండబోవని చెప్పేవేళ.....
కాలానికి హద్దులు చెరిపి
ఏ గాలానికి దొరకని గాలిపటాల్లా సాగిపోదాం.....
స్నేహానికి చిరుగుర్తులమై మిగిలిపోదాం.....