స్నేహం
స్నేహం
పుష్పం కోరేను తుమ్మెద స్నేహం...
కలువలు వేచేను చంద్రుని కోసం..
నా మది కోరేది నిన్నే నేస్తం..
ఎక్కడ ఉన్నా నీచే ధ్యానం..
కనుల పండుగగా నిను చూడాలని,
నీ కన్నులలో కొలవుండాలని..
వెన్నెలమ్మకి వెల్లడించిన..
కోయిలమ్మతో కబురు పంపిన..
వేగుచుక్కను నిను వెదకమన్న..
చల్లగాలిని నిను చేరమన్నా..
మది చాటు భావాలు తెలపమన్నా..
మనసంతా నీవేనని చెప్పమన్న!!
... సిరి ✍️❤️

