STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

స్నేహం

స్నేహం

1 min
334

స్నేహానికి నిర్వచనం..చెప్పలేను మాటలతో..! 

రెండు ఒక్కటై ఉన్నది..తెలుపలేను మాటలతో..! 


ఏంచెబితే ఏమున్నది..ఏదోలా సంజాయిషి..

తీపిమనసు నొప్పించగ..తలచలేను మాటలతో..! 


అర్థాలో అపార్థాలొ..వెతకాలా ఊపిరులకు.. 

నిట్టూర్పుల గీతాలను..అల్లలేను మాటలతో..! 


మౌనమెంత మధురమంటె..విరహవీణ పలికేనా.. 

అలజడులకు ఆలయమే..కట్టలేను మాటలతో..! 


ఇటుకలతో నిర్మించిన..సమాధితో పనేముంది.. 

శూన్యమైన గుండెపట్టి..మీటలేను మాటలతో..! 


తాళమెలా వేయగలను..వేదించే తలపుగదికి.. 

అసలుప్రేమ ఊయలేదొ..వేయలేను మాటలతో..! 


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance