సంధ్య వేళ
సంధ్య వేళ
దినాంతంలో వచ్చెను సంధ్య వేళ,
ఆకాశంలో వీక్షించెను తారల మేళ,
వెండికిరణాలు చూపెను చంద్రకళ,
పడమటి సూర్యం మెరిసెను తళతళ |౧|
అలసిన జనం ఇంటికి వచ్చెను ఈ వేళ,
పక్షులు ఆనందతో రవం చేసెను ఈ వేళ,
పరిమళ మల్లెపూలు వికసించెను ఈ వేళ,
రాత్రి అంధకారం మొదలయ్యెను ఈ వేళ |౨|