STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

సముద్రమా

సముద్రమా

1 min
6


నీవుగాక ఇంకెవరో..తోడెందుకు సముద్రమా..! 
ఉప్పుగాలి తేమలేని..నవ్వెందుకు సముద్రమా..! 

పాడుకోను మిగిలెనేమి..ప్రేమ పంచు కోకిలమకు.. 
విరహాగ్నిని చల్లార్చని..వలపెందుకు సముద్రమా..! 

నీవుగాక విను సఖుడే..దొరకకనే ఈ యాతన.. 
అలజడినే కాల్చలేని..చూపెందుకు సముద్రమా..! 

ఎన్ని రత్నరాశులనో..దాచుకున్న ఘనతనీది.. 
మౌననిధిని చేరలేని..మనసెందుకు సముద్రమా..! 

ఊరించే మేఘబాల..ఊపిరులను నిలిపేవా.. 
మరపే నా చెలియైతే..మధువెందుకు సముద్రమా..! 

రేటు పెడితె నిజగౌరవ..డాక్టరేటు పట్టాలట.. 
సిగ్గువిలువ పట్టలేని..చదువెందుకు సముద్రమా..!


Rate this content
Log in

Similar telugu poem from Classics